డిసెంబర్ 14 న జరుగుతున్న ఆర్టీసీలో క్రెడిట్ -కో-పరేటివ్ సొసైటీ (సిసియస్) ఎన్నికలలో ఎంప్లాయిస్ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు కోరారు.
ఈయూ ఆధ్వర్యంలో పాలకమండలి మళ్లీ ఏర్పడితే 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు సోసైటీ ద్వారా ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమపదకాలును, ఆర్దిక ప్రయోజనాలు కలిగే పద్దతులను మెరుగు పర్చడమేకాకుండా,మరికొన్ని కొత్త పధకాలు,కొత్తలోన్లు కూడా ప్రవేశ పెట్టాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు.
ఎంప్లాయిస్ యూనియన్ (ఇ.యు) అబ్యర్దులను ఈ ఆర్టీసి సొసైటీ(సిసియస్)ఎన్నికలలో జిల్లాలో ఉన్న అన్ని స్దానాలలోను గెలిపించాలని ఏపి పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేసారు.
శ్రీకాళహస్తి డిపోలో బుదవారం శ్రీకాళహస్తి డిపోలో ఇ.యు జోనల్ నాయకులు యన్.వి.యస్.బాబు అద్యక్షతన ఇ.యు బహిరంగ సభ జరిగింది. ఈసభలో శ్రీకాళహస్తి డిపోలో సిసియస్ ఎన్నికలలో పోటీచేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ అభ్యర్దులు టి.మాదవాఆచారి, కె.సునీల్ అబ్యర్దులను గెలిపించాలని కోరారు.
ప్రచారకార్యక్రమంలో ముఖ్యఅతిధిలుగా పాల్గొన్న రాష్ట్రప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, ఉపప్రధానకార్యదర్శి ఆవులప్రభాకర్ యాధవ్ మాట్లాడూతు ప్రస్తుతం 2012 నుండి గత పదేళ్లుగా సిసియస్ పాలకమండలి ఇ.యు కూటమి ఆద్వర్యంలోనే నడుస్తుఉంది.
గతంలో NMU ఆద్వర్యంలో సిసియస్ పాలకమండలి ఉన్నప్పుడు ఉద్యోగి లోను పెట్టుకుంటే ముడునెలలు అయినా సరే లోను వచ్చేవికాదు, అలాంటిది ఇప్పుడు ఋణధరఖాస్తు పెట్టుకున్న మూడురోజులకే లోను మంజూరు అయ్యేలా ఇ.యు హయాంలో చేయగలిగామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఏన్నోళ్లుగా NMU హయాం నుండి మేనేజ్ మెంటు సిసియస్ నుండి వాడుకున్న డబ్బులు రూ. 174 కోట్లును ఈమధ్యనే యాజమాన్యం వద్దనుండి వసూళ్లు చేయగలిగామని దీంతో ఉద్యోగుల అవసరాలు నిమిత్తం మరోక కొత్తలోనును ప్రవేశపెట్టపెట్టడమేకాకుండా, ఉద్యోగుల పిల్లలు విదేశీచదువులు కోసం రూ.20 లక్షలు వరకు ఋణం మంజూరు చేయిస్తామని హామి ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులేకు నిరంతరం వస్తున్న సమస్యలు పరిష్కరించగలిగిన సత్తా ఉన్న ఇ.యు ని ఈ సిసియస్ ఎన్నికలలో గెలిపించి మరొకసారి పాలకమండలిని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులకు వారు విజ్ఞప్తి చేసారు.
ఈసమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.పార్టీ చిత్తూరు జిల్లా అధికారపార్టి ప్రతినిధి శ్రీకాళహస్తి డిపో ఇ.యు గౌవరవ అధ్యక్షులు అంజూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులను ప్రభుత్వఉద్యోగులగా మార్పుచేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసి ఉద్యోగుల జీతబత్యాలకు ఏడాదికి రూ. 3,500 కోట్లు జీతభత్యాలకు కేటాయిస్తుందని తెలిపారు.
అలాగే ఈసమావేశంలో పాల్గొన్న ఇ.యు రాష్ట్రఛీఫ్ వైస్ ప్రెసిడెంటు పి.సుబ్రమణ్యంరాజు, నెల్లూరు జోన్ జోనల్ కార్యదర్శి డి.బాబూసామ్యూల్ మాట్లాడూతూ నిరంతరం ఆర్టిసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తున్న ఇ.యు బలపర్చిన ఇద్దరు అభ్యర్దులను ఈ సిసియస్ ఎన్నికలలో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
ఈకార్యక్రమంలో చిత్తూరు రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు డి.గురునాధం, టి.సత్యన్నారాయణతో పాటు ఇ.యు నాయకులు చంధ్ర, మధు, బాబు పాల్గొన్నారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు సి.యస్.బాబు, కార్యదర్శి పి.యస్.కుమార్, గ్యారేజ్ సునీల్ కుమార్ తోపాటు ముఖ్యకార్యకర్తలు,మహిళా కార్యకర్తలు, ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
.