• About Us
  • Contact Us
  • Our Team
Friday, October 9, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : మనలోని పేదరికపు చిహ్నం!

admin by admin
November 20, 2021
0
Good Morning : మనలోని పేదరికపు చిహ్నం!

ఏది సంపద- ఏది పేదరికం! ‘ఏది సత్యం ఏది అసత్యం’ అని తాత్వికులు ప్రశ్నించే సందేహం కంటె పెద్దది ఇది. అప్పులేనివాడు అధిక సంపన్నుడు లాంటి వాక్యాలు అనేకం, సంపద లేని వారు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవాడనికి, అంతరంగానికి సర్ది చెప్పుకోడానికి ఉపయోగపడుతుంటాయి. అయినా సరే సందేహం సందేహమే- ఏది సంపద? ఏది పేదరికం?

సంపద అంటే డబ్బు సంపాదనే కదా. సక్సెస్ అంటే, జీవితంలో అభివృద్ధి సాధించడం అంటే కూడా డబ్బు సంపాదించడం మాత్రమే అని బలంగా నమ్మే వాతావరణంలో ఉన్నాం మనం. అది తప్పు కూడా కాదు. డబ్బు కూడా లేకుండా, సంపాదించడం చేతకాకుండా సంపన్నుడని అనుకోవడం ఎలా సాధ్యం- ప్రాక్టికల్‌గా!?

కానీ ఓ సుభాషితం సంపద- పేదరికాలకు సంబంధించిన వ్యత్యాసాలను ఇంకోలా చెబుతుంది-

స హి భవతి దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్రాః

పెద్దపెద్ద వాంఛలు ఉన్నవాడే నిజమైన దరిద్రుడు. ఎవడైనా పూర్తి సంతృప్తి చెందిన వాడు ఉన్నట్లయితే.. ఇక సంపన్నుడు- దరిద్రుడు అనే తేడా ఎక్కడ కనిపిస్తుంది. -అనేది శ్లోకభావం.

జీవితం పట్ల సంతృప్తి ఉన్నప్పుడు ఇక పేదరికం గురించిన చింత ఎందుకు ఉంటుంది? కొన్ని కోట్ల రూపాయల సంపద ఉన్నవాడికైనా సరే.. ఇంకా ఇంకా పెద్దపెద్ద వాంఛలు ఉన్నప్పుడు.. వాడు దారిద్ర్యంలో బతుకుతున్నట్టే లెక్క. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే.. మనలో ఉండే అసలైన దారిద్ర్య లక్షణం – ‘వాంఛ Desire’! సంపద చిహ్నం- ‘సంతృప్తి’!

సంపదకు- దరిద్రానికి మధ్య ఉండే విభజన రేఖ డబ్బు మాత్రమే. డబ్బు తూకం రాళ్ల మీదనే ప్రపంచం పేదరికాన్ని, సంపన్నులను గుర్తిస్తుంది. గౌరవ ఛీత్కారాలన్నీ కూడా డబ్బు ప్రాతిపదికగానే దక్కుతుంటాయి. కానీ.. అంతరంగంలోంచి చూసినప్పుడు ‘సంతృప్తి- వాంఛ’ అనేవే ధనిక- పేద వ్యత్యాసాలుగా ఉంటాయి.

ధనిక- పేదల మధ్య పోలికలతో మనకు చాలా కథలుంటాయి. మచ్చుకు అందరికీ తెలిసినదే ఒక కథ గుర్తు చేసుకుందాం.  ఒక ధనవంతుడు- రోడ్డు పక్కన గుడిసెలో బతుకుతున్న దరిద్రుడి దగ్గరికెళ్లి.. ‘బాబూ నాకు చాలా సంపద ఉంది. కానీ నువ్వంటే అసూయ కూడా ఉంది. నువ్వు చాలా సంతోషంగా బతుకుతున్నావు. ఆ సంతోషం నాకు లేదేమిటి’ అని అడిగాడుట.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

అందుకా పేదవాడు ‘నాకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.. కాబట్టే సంతోషంగా ఉన్నా’ అని చెప్పాడుట. ఇలాంటి కథలు చాలా ఉంటాయి. అంటే సంపద మాత్రమే దుఃఖహేతువు అన్నట్టుగా, సంపద గురించిన ధ్యాస, పిచ్చి లేకపోవడమే సంతోషం, నిజమైన గొప్ప జీవితం అన్నట్టుగా మన భావాలను ట్యూన్ చేయడానికి చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.  అయినా ఆ భావజాలం పూర్తిగా కరెక్టు అనుకోవడానికి వీల్లేదు.

ఈ కథలను సుభాషితం చెప్పే అంతరార్థంతో పోల్చుకుని మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ద్వేషించాల్సింది సంపదను కాదు. విడిచిపెట్టాల్సింది సంపదను కాదు- వాంఛని. ఎంత సంపద ఉన్నా.. మన వాంఛలు ఖరీదైనవే అయినా.. ఆ సంపదకు లోబడి ఉంటే వాడు నిజమైన సంపన్నుడే లెక్క. ఈ ప్రకారం తక్కువ కోరికలు, ఎక్కువ సంతృప్తి ఉండేవాడు నిజమైన సంపన్నుడు అవతాడు.

శుభోదయం

మరింత రెచ్చగొట్టేలా రోజా వెక్కిరింత!

ప్రధాని మోడీ క్షమాపణ : ప్రసంగం పూర్తి పాఠం

శెభాష్ మోడీ! ఓడిపోవడమే- మీ విజయం!

 

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtsrich and poorsubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapధనిక పేద తేడాలుభర్తృహరి సుభాషితంమంచిమాటవాంఛ కోరికశుభోదయంసంతృప్తిసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

6.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాల ఆంతరంగిక చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply