రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ కూడలి వద్ద బియ్యపు ఆకర్ష్ రెడ్డి, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
మంత్రి రాక సందర్భంగా పెద్ద ఎత్తున వైయస్సార్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఏపీ సీడ్స్ వద్ద బాణసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బియ్యపు ఆకర్ష్ రెడ్డి పుష్పమాల ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి అమ్మవార్ల కలంకారీ చిత్రపటం ఇచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘనంగా సత్కరించి సరస్వతి దేవి ప్రతిమ బహుకరించారు.
ఆలయ వేద పండితులచే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆశీర్వదింప చేసి… స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పోరేషన్ డైరెక్టరు లోకేష్ యాదవ్, నాయకులు వయ్యాల కృష్ణారెడ్డి, పగడాల రాజు మున్నా, జయశ్యామ్, సురేష్, నాని, కుమార్ స్వామి, సెన్నీరు కుప్పం శేఖర్, పత్తి మణి, కంఠా ఉదయ్, పంతులు, చలపతి, నరసింహులు, మునిరెడ్డి, బాలా గౌడ్, ధన, కళ్యాణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.