శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు పోతుగుంట గురవయ్యనాయుడు సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో సోమవారం గురవయ్య నాయుడు ప్రథమ వర్ధంతి నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గురవయ్యనాయుడు లేని లోటు తీర్చలేనిదన్నారు.
ఆయన మన మధ్య లేక పోవడం తనకెంతో బాధ కలిగిస్తోందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
గురవయ్యనాయుడు నిజాయితీకి మారు పేరన్నారు. ఇక గురవయ్య నాయుడు పెద్ద కుమారుడు రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి ఎంతో క్రమశిక్షణ గల నేత అన్నారు. ఆయన ఆశయం తెలుగుదేశం పార్టీ అభివృద్ధేనని చెప్పారు.
తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నపుడు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి నిత్యం ఫోన్ చేసి పలకరించే వారన్నారు. నివాళుల అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహక్ష్ వద్ద అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు రవీంద్రనాథరెడ్డి, చెంచయ్యనాయుడు, రావిళ్ల మునిరాజానాయుడు, పొన్నారావు, షాకీరాలీ తదితరులు పాల్గొన్నారు.
.