• About Us
  • Contact Us
  • Our Team
Thursday, September 10, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

#hbd వశిష్ట సింహా.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ బుద్ధులే!

admin by admin
October 19, 2021
0
#hbd వశిష్ట సింహా.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ బుద్ధులే!

నారప్పతో తెలుగు తెరపై కనిపించి.. వరుస అవకాశాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న కన్నడ నటుడు వశిష్ట సింహా.. ఇవాళ (19 అక్టోబరు) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్ నయీమ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘నయీమ్ డైరీస్’ లో ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్ నయీమ్ చిత్రమైన వ్యక్తి. ఎక్సెంట్రిక్ విపరీత బుద్ధులు గలవాడిగా పేరుపడ్డాడు. అలాంటి నయీమ్ జీవితకథను తెరకెక్కించడం అనేది కత్తిమీద సాము. నయీమ్‌తో ప్రత్యక్ష పరిచయం కూడా ఉన్న రాంగోపాల్ వర్మ, ఆ జీవితాన్ని సినిమాగా తీయాలనుకున్నప్పటికీ తర్వాత మానుకున్నాడు. స్వయంగా నక్సలైట్ గా పనిచేసిన అనుభవం ఉన్న దర్శకుడు దామూ బాలాజీ.. సాహసించి నయీమ్ కథను తెరకెక్కిస్తున్నారు.

నయీమ్ జీవితాన్ని తెరకెక్కించే ముందు దర్శకుడు దామూ బాలాజీ.. ప్రధానంగా రెండు విషయాలు అనుకున్నారు. రూపంలో నయీమ్ ను గుర్తుకు తెచ్చే వ్యక్తితో హీరో పాత్ర చేయించడం ఒక ఎత్తు. అయితే బిహేవియర్ లో నయీమ్ ను గుర్తుకు తెచ్చే వారితో చేయించడం మరో ఎత్తు. వీటిలో రెండో పద్ధతి క్లిష్టమైనది. దర్శకుడికి సవాలు. అయినా దామూ బాలాజీ ఆ పద్ధతినే ఎంచుకున్నారు. అనేక మంది నయీమ్ సహచరులు, మాజీ నక్సలైట్లు, కుటుంబసభ్యులను కలిసి.. నయీమ్ గురించి అనేక విషయాలను శోధించి తెలుసుకున్నారు. అతని అలవాట్లు , ప్రవర్తన, విపరీత ధోరణులు అన్నీ ఆకళింపు చేసుకున్నారు.

రెండుసార్లు ఉత్తమనటుడిగా కూడా పురస్కారం అందుకున్న కన్నడ నటుడు వశిష్ట సింహాను ఈ సినిమాకు ఎంచుకున్నారు. బొద్దుగా, లావుగా కనిపించే నయీమ్ పాత్ర చేయడానికి వశిష్ట సింహా రూపంలో సరిపోలడు. కానీ.. ప్రవర్తనతో ఆ సినిమాలో నయీమ్ ను గుర్తుకు తెస్తాడు. నయీమ్ అలవాట్లు, బాడీ లాంగ్వేజీ, బిహేవియర్ మొత్తం తెలియడానికి చాలా కసరత్తు జరిగింది.

సాధారణంగా అసలు పాత్ర వీడియోలు అనేకం చూసి బాడీ లాంగ్వేజీ అలవాటు చేసుకుంటారు. కానీ.. అతని తత్వం కూడా తెలుసుకోవడానికి జైల్లో నయీమ్ తో కలసి గడపిన అనేకమందితో వశిష్ట సింహా ఇంటరాక్ట్ అయ్యేలా దర్శకుడు దామూ బాలాజీ చేశారు. మొత్తానికి నయీమ్ పాత్రలో వశిష్ట సింహా పరకాయ ప్రవేశం చేశాడు. చివరికి ఆ ఎఫెక్ట్.. సినిమా యూనిట్ కే కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

సాధారణంగా నయీమ్ విపరీత ధోరణులు, ఎక్సెంట్రిక్ అలవాట్లతో తన చుట్టూ ఉండే వారికి చిరాకు పుట్టించే వ్యక్తి. నయీమ్ తో ఉన్న వాళ్లకు నిత్యం ఇరిటేటింగ్ గా ఉంటుంది. నిత్యం వారికి ఒక తెలియని టెన్షన్ ఉంటుంది. నటుడుగా కెమెరా ముందు  ఆ తత్వాన్ని ప్రదర్శించడం వేరు. కానీ.. వశిష్ట సింహా పాత్రలో లీనమైపోయి.. సెట్ లో ఉన్న పూర్తి సమయం అదే తరహాలో.. తన చుట్టూ ఉన్న వారికి ఇరిటేషన్ పుట్టేలా, టెన్షన్ పుట్టేలా ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేసేవాడు.

మెథడ్ యాక్టింగ్ అనే పద్ధతి ఉంటుంది. అంటే నటుడు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం వంటి పద్ధతన్నమాట. నిజానికి సెట్ లో వశిష్ట సింహా ఉంటే.. యూనిట్ మొత్తానికి ఒక ఇరిటేషన్ ఉండేది. షాట్ బయట కూడా పాత్రలో లీనమైపోయి ఉండేవాడు. అతడు ప్రవర్తించే తీరు చూసి.. యూనిట్ లోని చాలామంది ఆశ్చర్యపోయే వాళ్లు. కానీ.. కెమెరా కట్ చెప్పిన తర్వాత కూడా.. వశిష్ట సింహా.. నయీమ్ గానే ఉండిపోతున్నాడనే సంగతి వారికి అర్థమయ్యేది కాదు. బయటకూడా నయీమ్ లాగా బిహేవ్ చేసేవాడు.

EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

మొత్తానికి నయీమ్ పాత్రలో జీవించేయడం ద్వారా… వశిష్ట సింహా ఏమేరకు మెప్పించాడో.. తెలుగు ప్రజలకు బాగా తెలిసిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ను తెరమీద ఆవిష్కరింపజేయడంలో ఎంత మేరకు సక్సెస్ అయ్యాడో.. నయీమ్ ను రూపంలో పోలి ఉండని వ్యక్తితో నయీమ్ జీవితాన్ని.. ‘నయీమ్ డైరీస్’ అనే టైటిల్ తో పండించడంలో దర్శకుడు దామూ బాలాజీ ఎంత మేరకు సక్సెస్ అయ్యాడో వేచిచూడాలి.

తెలుగు తెర నయీమ్.. వశిష్ట సింహాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఇవి కూడా చదవండి :
‘రామ్’ బాణమ్ :  సినిమా వాళ్లు పాలిటిక్స్ కు పనికొస్తారా?
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

 

Tags: ca varadarajudaamu balajidirector daamu balajigangster nayeemhbd vasishta simhanaxalite nayeemnayeem diariesnayeem diarynayeem life secretsnayeem movietelugu movie secretsvasishta simhaనయీమ్ వశిష్ట సింహా
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply