చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహితార్య దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్ఫాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి, సూపరిండెంట్ నాగభూషణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.