లాసెట్ సీట్ల కేటాయింపు గడువును పొడిగించాలని జైభీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ డిమాండు చేశారు.
ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది లా సెట్ కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన మొత్తం వెబ్ ద్వారా జరిగిందన్నారు.
సీటు కేటాయింపబడిన కళాశాలలో ఈ నెల 9నుంచి 12వ తేదీలోగా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు సమర్పించాలంటూ గడువు విధించారని ఆయన చెప్పారు.
అయితే ప్రస్తుతం సంక్రాంతి సెలవులు అయినందున విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ తెలిపారు.
విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏపీ లా కమిషన్ వారు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి సెలవులు తరువాత సర్టిఫికెట్లు సమర్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
.