• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

మహా పాదయాత్రలో సొమ్మసిల్లిన బొజ్జల 

admin by admin
December 7, 2021
0
మహా పాదయాత్రలో సొమ్మసిల్లిన బొజ్జల 

మహాపాదయాత్రలో చిన్న అపశ్రుతి. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను హుటాహుటిన  ఆస్పత్రికి తరలించారు. 

‘అమరావతి యాత్ర’లో శ్రీకాళహస్తి నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్దకు చేరుకుంది.

పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్వాగతం పలకడానికి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెళ్లారు. అమరావతి రైతులకు ఘనంగా స్వాగతం పలికారు. వారితో పాటు కొంతదూరం నడిచారు. పాదయాత్రలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ తరువాత పాదయాత్రలో నడుస్తుండగా ఆయనకు బీపీ తగ్గి పోయింది. వాంతి చేసుకుని.. అస్వస్థతకు గురై అక్కడే పడి పోయారు.

దీంతో టీడీపీ శ్రేణులు వెంటనే ఆయన్ను రేణిగుంట మండలంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్సలు అందించారు. దీంతో సుధీర్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

కాగా గతంలో కూడా చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పేడు మండలంలో జరిగిన కార్యక్రమంలో కూడా సుధీర్ రెడ్డి ఒకసారి అస్వస్థతకు గురయ్యారు. సుధీర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలోకి ‘అమరావతి యాత్ర’

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండు చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 37వ రోజైన మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్దకు అమరావతి రైతులు చేరుకోగానే చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు వందలాది మంది స్వాగతం పలకడానికి తరలి వచ్చారు. జగ్గరాజుపల్లె వద్ద కొంతమంది రైతులు, నేతలు మోకాళ్లపై కూర్చుని వందనం చేస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్వాగతం పలికారు. జై అమరావతి… జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె నుంచి సుమారు 16 కి.మీ. దూరంలోని ఏర్పేడు మండలం చింతలపాళెం వరకు చేస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం ఎంపేడు వద్ద అమరావతి రైతులకు భోజన ఏర్పాట్లు చేశారు. భోజన ఏర్పాట్లు చేసే ప్రాంతంలో చదును చేసిన భూమిని… గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాల సాయంతో దున్నేశారు. దీంతో మొదటి ఎంఫిక చేసిన స్థానంలో కాకుండా… వేరే చోట భోజన ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. కాగా శ్రీకాళహస్తి మండలంలో పాదయాత్ర చాలా ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ, టీడీపీ జిల్లా కన్వీనరు పులివర్తి నాని, శ్రీకాళహస్తి నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, టీడీపీ నేతలు చెలికం పాపిరెడ్డి, తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి, చెంచయ్యనాయుడు, చక్రాల ఉష, విజయకుమార్, కంఠా రమేష్, కామేష్ యాదవ్, పొన్నారావు. రెడ్డివారి గురవారెడ్డి, హరిక్రిష్ణ నాయుడు, మోహన్ క్రిష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇబ్బందులు పెట్టడం బాధాకరం

శ్రీకాళహస్తి మండలంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి స్థానిక శాసససభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ప్రయత్నించడం బాధాకరమని నియోజక వర్గ టీడీపీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేసే రైతులకు ఎంపేడు వద్ద భోజన వసతి ఏర్పాట్లు చేస్తుంటే చదును చేసిన స్థలాన్నివైసీపీ నేతల చేత దున్నేయించారన్నారు. ఇలా చేయడం వారి దౌర్జన్యానికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్పాలన్నారు. ఇక అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని 700 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా జగన్ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోక పోవడం బాధాకరమన్నారు. ఏపీకి రాజధాని ఏదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే జగన్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి అడ్డంకులు సృష్టిస్తోందని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఆయన అభినందనలు తెలియచేశారు. రాష్ట్ర ప్రజలందరూ వీరి ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: srikalahasti localsrikalahasti newssrikalahasti topsrikalahasti updatesచిత్తూరు జిల్లాబొజ్జల సుధీర్ రెడ్డిశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుసుధీర్ రెడ్డికి అస్వస్థతసొమ్మసిల్లిన సుధీర్ రెడ్డిస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply