శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కాసరం మాజీ ఎంపీటీసీ సంపూర్ణమ్మను శుక్రవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు పరామర్శించారు.
సంపూర్ణమ్మ గత కొద్ది నెలలుగా వెన్నుపూస నొప్పితో బాధపడుతూ తిరుపతిలోని హాస్పిటల్ నందు చికిత్స పొంది, స్వగ్రామమైన కాసరం కు ఆరోగ్యంగా వచ్చారు.
ఈ నేపథ్యంలో గాలి మురళీ నాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవాన్ని తేవాలని… చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసే బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాధవయ్య, కొణతనేరి మాజీ ఎంపీటీసీ భాస్కరయ్య, నాయకులు భాస్కర్ నాయుడు, చెంచయ్య, రాఘవులు, శ్రీనివాసులురెడ్డి, రత్నయ్య నాయుడు, గోపాల్, చెంగల్ రాయులు, వెంకటేశ్వర్లు, సుబ్రమణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
.