తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. శ్రీకాళహస్తిలో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి శ్రీకాళహస్తి అభివృద్ధి ప్రదాత అన్నారు. ఆయన హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
శాంతి భద్రతలు ఏనాడూ విఘాతం కలగలేదన్నారు.
అలాంటి వ్యక్తి కొవిడ్ బారిన పడటం తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఈ దంపతులు త్వరగా కోలుకుని శ్రీకాళహస్తికి రావాలని కాంక్షించారు.
ఈ కార్యక్రమంలో షాకీరాలీ, షఫీ, బషీర్, ఖలీల్, మస్తాన్, కరీం, అస్మత్, మీర్జా, ఖాదర్ బాషా, మహమ్మద్, హజ్రత్, అలీ, రఫీ, లాల్ బాషా, నూరు, సమీవుల్లా, సాజిద్, అబీద్, మీర్జాసా, ఫాసిల్, ఖాదర్ వలీ, అభిమానులు పాల్గొన్నారు.
.