డిసెంబర్ 26,27, తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ జిల్లా 15వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు.
శనివారం నగరి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏ ఐ టి యు సి నగరి సమితి ముఖ్యుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ కార్మిక హక్కుల పోరాటాల రథసారథి ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా15వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో ఘనంగా జరగనున్నాయని తెలిపారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో పాలక ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వరంగ స్కీముల్లో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి మిడ్ మీల్స్ గ్రీన్ అంబాసిడర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఏపీ స్పీపర్స్ ప్రభుత్వం మున్సిపల్ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఆందోళనలకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఆయన ప్రకటించారు.
వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన భవణ నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఉపాధి కోల్పోయిన టువంటి ఆటో వీధి విక్రయదారులు హమాలీ కార్మికులు ఆదుకొని కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
మున్సిపల్ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంతో పాటు వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర్ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్యా, ఏ టి సి అనుబంధ సంఘాల నాయకులు సూర్యప్రభ రూపా జమున నవమి మురళి శేఖర్ వెంకటేష్ సుబ్రహ్మణ్యం సతీష్ రూపుకుమార్, దేశపతి శేఖర్ ఉష సుమతి మల్లీశ్వరి కార్మికులు పాల్గొన్నారు
.