ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రళయం లో నిరాశ్రయులైన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం గా రు.10 వేలు అందించి ఆదుకోవాలని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు..
మంగళవారం గాలి భాను వడమాలపేట మండలం రామసముద్రం ఎస్టీ కాలనీ వర్ష బాధితులను పరామర్శించారు. అనంతరం వడమాల చెరువు ను పరిశీలించారు. వర్ష బాధిత కుటుంబాలకు తెలుగు యువత ఆద్వర్యంలో కూరగాయలు, పాలు, బ్రెడ్ ప్యాకెట్ లను పంపిణీ చేసారు.
కాలనీ ప్రక్కనే కాలువ నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మునిగిపోయిందని, ఇండ్లు దెబ్బతిన్న కారణంగా ఇక్కడి ప్రజలు పూర్తిగా నిరాశ్రయులయ్యారని తెలిపారు. ప్రభత్వం ఈ కాలనీలో దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందించి, కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో వరద ప్రవాహం కు పలు మండలాలలో వందల ఇండ్లు, రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని,వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. పలు మండలాలలో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోండి అని కోరారు.
ప్రజలు కొన్ని గ్రామాలలో త్రాగునీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారు.. వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు.
వీరి వెంట మండల పార్టీ అధ్యక్షులు జానా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి హేమావతి, చిత్తూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి ధనంజేయులు నాయుడు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పి.వెంకటేష్, పార్లమెంటరీ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న,పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు మునిశేఖర్, శివ, వెంకటేశ్వర రావు, మురళి రాజు, నవీన్, వినోద్,చైతన్య, ఉమాపతి, సతీష్ లు ఉన్నారు.
.