విజయవాడలో ఎమ్మేల్యే ఆర్కే రోజా జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గారిని కలిశారు.
గాజులమండ్యం శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు రావలసిన జీత భత్యాల బకాయిల గురించి, ఈ ఫ్యాక్టరీ ను తెరిపించడానికి తీసుకోవలసిన చర్యల గురించి మరియు నిండ్ర సుగర్ ఫ్యాక్టరీ రైతు బకాయిలు తొందరగా ఇప్పించడానికి గురించి చర్చించారు.
అదేవిధంగా నగరి లో పరిశ్రమల స్థాపన కు చర్యలను త్వరితగతిన చేయాలని మాట్లాడారు.
ఇది మాత్రమే నియోజకవర్గం లో యువత కు ఉద్యోగ అవకాశాలు ఇప్పించగలదని తెలియపరిచారు .
ఈ సమావేశంలో మంత్రి గారు ప్రతిస్పందిస్తూ షుగర్ ఫ్యాక్టరీ విషయాలు తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు, మరియు పరిశ్రమల స్థాపనకు ఉద్యోగావకాశాలకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు
.