విద్యార్థులకు సంస్కృతి , సంప్రదాయాలను నేర్పించాలని మునెప్పనాయుడు కండ్రిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ అన్నారు.
శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో యువత, పిల్లలు హైటెక్ సంస్కృతి పేరుతో మన సంస్కృతి , సాంప్రదాయాల మూలాలను మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి దశలోనే సంస్కృతి పట్ల మక్కువ ఏర్పరచడం వల్ల మన సంస్కృతిని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు , ఉపాధ్యాయులు కలసి సాంప్రదాయబద్దంగా పాడే గొబ్బిళ్ళ పాటలు పాడారు.విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భువనేశ్వరి , ఉపాధ్యాయురాలు ద్రాక్షాయణి , విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
.