నెల్లూరు నగరంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగే నారీ సంకల్ప దీక్షను జయప్రదం చేయాలని తెలుగు మహిళలు పిలుపునిచ్చారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు మాట్లాడారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు చాలా పెరిగి పోయాయన్నారు. ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామన్నారు.
ఈ దీక్షను జయప్రదం చేయడానికి మహిళలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుమతి, శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కృష్ణ వేణి, సీనియర్ నాయకురాలు రేణుకమ్మ, ప్రధాన కార్యదర్శి దుర్గ, శ్రీ లక్ష్మి, ఊహ, సుజాత, ఏర్పేడు మహిళా అధ్యక్షురాలు హంస, లత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.