ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని శ్రీకాళహస్తి డివిజను సంక్షేమ వెనుకబడిన తరగతుల అధికారి చంద్రశేఖర్ అన్నారు.
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు బుధవారం శ్రీకాళహస్తి ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం నందు ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా అశువులు బాశారన్నారు.
విలువలతో కూడిన ఆనాటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు హేమావతి., శ్రీలక్ష్మి., విద్యార్ధినులు పాల్గొన్నారు.
.