పీ ఆర్సీ కనీసం 30శాతం పెంచాలని ఏపీటీఎఫ్ నేతలు డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిట్ మెంట్ 23శాతం మాత్రమే ఇవ్వడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్ట పోతారని వారు వాపోయారు.
ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇవ్వడం చాలా బాధాకరమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. ఫిట్ మెంటు తక్కువ ఇవ్వడం వలన ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీపీఎస్ పై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోక పోవడం బాధాకరమన్నారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ రెండన్నర ఏళ్లు దాటినా… ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని వారుప్రశ్నించారు.
ఇక ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాల లో విలీన ప్రక్రియ ఆపాలని… హెచ్ఆర్ఏ పాత శ్లాబు ప్కారం అమలు చేయాలని వారు డియాండు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనా బేగంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, జయరాం, మురళీకృష్ణ, కయ్యూరు బాలసుబ్రమణ్యం , పెరుమాళ్, నాగరాజు, వెంకటాద్రి, ఉదయ్, చంద్ర, చంద్రారెడ్డి, ,మునిరాజ, శివ, సత్య, శీను, ఈశ్వరయ్యతో పాటు..
శ్రీకాళహస్తి పట్టణ శాఖ నుంచి అధ్యక్షులు కె. వెంకటాద్రి , ఉపాధ్యక్షులు ఆర్. గోపాల్, ఉపాధ్యాయులు పీడీ చంద్రశేఖర్, వి. హరినాధ్, బి. సురేష్ బాబు, షాకీరాలీ, పి. భాస్కర్, బి. జయరాం, నజీరఖాన్, ఎన్. కవిత… తొట్టంబేడు మండల శాఖ నుంచి బీఎన్. మునినిరాజా, కె. మునీశ్వర్ రెడ్డి, కెఎంవీ కృష్ణయ్య, వి. నగసత్య, పి. పెరుమాళ్, సి. శ్రీనివాసులు, ఎం. ప్రభుప్రసాద్, పి.శేఖర్, రవికుమార్, శ్రీనివాసులు..
బీయన్ కండ్రిగ మండలం నుంచి బి. రామదాసు, కేవీబీపురం నుంచి అధ్యక్షులు వి. గజేంద్ర, ,ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి వి. మధు, జిల్లా కౌన్సిల్లెర్ పి. చంద్రారెడ్డి… వరదయ్యపాలెం మండల నుంచి అధ్యక్షులు బి. శోభానాచలం , ప్రధాన కార్యదర్శి కె. ఉదయకుమార్, సి. భాస్కర్, పీవీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
.