ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ల పోరాటంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్లయ్య, జనార్ధన డిమాండ్ చేశారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై గత సంవత్సరం పొడవునా ఆందోళనలు చేశారన్నారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు పలు హామీలు ఇచ్చిందన్నారు. ఆ తరువాత హామీలు గాలికి వదిలేసిందన్నారు. ఎస్ కే ఎం ఇచ్చిన పిలుపు మేరకు విద్రోహ దినం పాటిస్తున్నట్లు చెప్పారు.
పంటకు మద్దతు ధర కు చట్టబద్ధత కల్పించాలని… పోరాటంలో మరణించిన రైతు లకు నష్టపరిహారం చెల్లించాలని.. పోరాట కాలంలో రైతుల పైపెట్టిన కేసులను ఎత్తివేయాలని. .లఖిమ్ పురి ఖేరి ఘటనలో నిందితుడుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా ను మంత్రివర్గoనుండి తొలగించాలని డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గంధం మణి, గురవయ్య రైతులు పాల్గొన్నారు.
.