చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రబ్జీర్ సెహ్రావల్ దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్ఫాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఏఈవో ధనపాల్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ సూపరిండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట మునిరెడ్డి, ఎస్సై సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.