సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖ సీఎండీ హెచ్ హరినాధ రావును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు.
శనివారం ఉదయం ఎమ్మెల్యే తిరుపతి లోని సీఎండీ కార్యాలయానికి చేరుకొని ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను ధాటికి తమ నియోజక వర్గం లోని 7 మండలాల్లో విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ ఫార్మర్ లు దెబ్బతిన్నాయని వివరించారు.
దీనివల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని వాపోయారు.
దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్ లను, విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరణ చేసి రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆది మూలం సీఎండీ హరినాధ రావును కోరారు.
.