విద్యతోపాటు దేశప్రతిష్టను ఇనుమడింపజేసే క్రీడలలో సైతం రాణించాలని వరదయ్యపాళెం మండల వైస్ ఎంపీపీ బొప్పన పద్మావతి పిలుపునిచ్చారు.
వరదయ్యపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఫిట్ ఇండియా కార్యక్రమంలో బాగంగా క్రీడా పోటీలను నిర్వహించారు.
గురువారం హైస్కూల్ లో జరిగిన బహుమతుల ప్రదానం కార్యక్రమంలో దివంగత మాజీ జెడ్పీటీసీ బొప్పన వెంకటకృష్ణయ్య జ్ఞాపకార్ధంగా రూ పదివేలు ఆర్థికసాయంతో విజేతలకు వైస్ ఎంపీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో వరదయ్యపాలెం సర్పంచ్ జ్యోతి ఎక్స్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ బొప్పన మోహన మురళి, HM.మోహన్ బాబు,విద్యా కమిటీ చైర్మన్ వెంకటేష్, పాల్గొన్నారు.
.