శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటలో వెలసిన చాముండేశ్వరిదేవి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.
ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 6గంటలకు అభిషేకం నిర్వహించారు.
8గంటలకు అమ్మవారికి నూతన వెండి చీర అలంకరించారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చారు.
ఆ తరువాత అమ్మవారిని పల్లకీపై అధిరోహింప చేసి… పట్టణ వీధుల్లో ఊరేగించారు.
పురవీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Discussion about this post