శ్రీ సిటీ ఎం. డి రవీంద్ర సన్నా రెడ్డి ఆదివారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు.
వీరికి కార్యనిర్వహణాధికారి డి.పెద్ది రాజు ఆదేశాల మేరకు ఆలయ ఏఈవో ధనపాల్ దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మేధా దక్షిణామూర్తి వద్ద దుశ్శాలువ తో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు. ఆలయ డిప్యూటీ ఈవో. ఎన్ఆర్. కృష్ణారెడ్డి ఆలయ ఏ ఈ ఓ ధనపాల్. ప్రోటోకాల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.