శ్రీకాళహస్తి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ రోదు బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు.
అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. భారత రాజ్యాంగం లో ఉన్నటువంటి చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే విధంగా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అనంతరం కొత్త కోనేరు వద్ద ఉన్న ఈశ్వరయ్య కాలనీ లో బెడ్స్ బిస్కెట్స్ పంపిణీ కర్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కార్యదర్శి శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు తొండు మల్లికార్జున్,రొడ్డా గోపి ,గణేష్,శేషయ్య, ప్రజా నాట్య మండలి కార్యదర్శి గురవయ్య, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు ముని చందు, మహిళా సంఘం నాయకులు ప్రేమ ,ప్రజా సంఘాల నాయకులు దొడ్ల , కొణిదల బాబు, బచ్చల రాజా ,చంద్రబాబు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
.