ఏపీటీఎఫ్ వారు ముద్రించిన 2022వ సంవ్సతర నూతన క్యాలెండరును గురువారం ఆవిష్కరించారు.
తొట్టంబేడు మండల వనరుల కేంద్రంలో ఈ ఆవిష్కరణ కార్యక్ర్రమం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.
అలాంటి సంఘ క్యాలెండరు ఆవిష్కరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి భారతి, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ ,మునిరాజా,క్రిష్ణయ్య,పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.
.