కొణిజేటి రోశయ్య మృతికి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్. ఎస్. బతైయ్యనాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అకాల మరణం చెందిన సందర్భంగా, శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఆయన రైతు నాయకుడు ఎన్ జి రంగా శిష్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
అప్పటినుంచి ఆయన రాజకీయ చాణక్యుడుగా, కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రభుత్వంలోనూ క్యాబినెట్ మినిస్టర్ గా ఉంటూ 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యగారి దేనని కొనియాడారు.
ఏనాడు గాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలను శివసాహిస్తూ తన రాజకీయ జీవితాన్ని సాగించిన, చాణుక్యుడు అని పేర్కొన్నారు.
తమిళనాడు గవర్నరుగా పని చేసిన తరువాత ఆరోగ్యరీత్యా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. జానీ భాష, బీ.వీ శేఖర్, ఎం. వెంకట మున, శెట్టిపల్లి శివ, ఎస్ నాగూరయ్య, భానమ్మ, తదితరులు పాల్గొన్నారు.
.