టీటీడీ కార్మికుల అక్రమ అరెస్టులకు నిరసనగా శ్రీకాళహస్తి సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు పుల్లయ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.
అధికారం ప్రదర్శించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం తగదని విమర్శించారు.
టీటీడీ ధార్మిక సంస్థలు ధర్మాన్ని కాపాడ కుండా అధర్మం ప్రవర్తిస్తూ దేవుని వద్ద పనిచేస్తున్న కార్మికుల పొట్ట కొట్టడం జగన్ ప్రభుత్వానికి ఉందని విమర్శించారు.
ఇక్కడ స్పందించి చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధం అని సిఐటియు పట్టణ కార్యదర్శి కావేరి వెంకటేష్, ఈశ్వరయ్య , అన్వర్ భాషా, ఉస్మాన్ భాష, ఏసురత్నం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
.