రెండు ప్రభుత్వ రంగ బ్యాంకు ల ప్రయివేటికరణకు నిరసనగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ బ్యానర్ పై వివిధ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిర్ణయించిన డిసెంబరు 16,17 తేదీల్లో జరుగు దేశవ్యాప్త సమ్మెకు సీఐటీయూ చిత్తూరు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును, సంఘీభావాన్ని తెలియచేస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021 ని ఆమోదించనున్న నందు న బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లో ప్రతిపాదిత సవరణను ప్రవేశపెట్టడాన్ని బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఈ నెల 16,17 తేదీల్లో జరుగు సమ్మెను జిల్లాలో ని కార్మికులు,ఉద్యోగులు,బ్యాంకు ఖాతా దారులు బలపరచాలని కోరారు.
2021 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటికరించనున్నట్టు చెప్పారని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకు లను ప్రయివేటికరణ చేయాలనే బిజెపి ప్రభుత్వ చర్య మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాధాన్యత రంగాలను దెబ్బ తీస్తుందని స్వయం సహాయక బృందాలకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని తెలిపారు.
బ్యాంకు లను కార్పొరేట్ కంపెనీలు కు అప్ప చెప్పాలనే నిర్ణయం పూర్తిగా రాజకీయ నిర్ణయమని విమర్శించారు.
దేశంలోని మొత్తం డిపాజిట్లలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయని ఈ డిపాజిట్లను ప్రయివేటు వారికి అప్పగించడం వల్ల బ్యాంకు ల్లో జమచేసి న సామాన్యుల డబ్బు కు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలసి రూ 50,863 కోట్ల అపరేటివ్ లాభాన్ని సాధించాయని చైతన్య తెలిపారు.
.