ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి కొనసాగాలని అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా సిపిఎం వారికి సంపూర్ణంగా మద్దతు తెలిపింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనాయకులు జగ్గ రాజు పల్లి వద్ద రాజధాని రైతులకు పచ్చ కండు వాలు కప్పి స్వాగతం పలికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు హంగేరి పుల్లయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పరిపాలన రాజధానిగా అమరావతి ఉండాలని సిపిఎం పార్టీ భావిస్తోందని తెలిపారు.
కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఎటువంటి వివాదాలు లేకుండా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధం మనీ కుప్పమ్మ ఈశ్వరయ్య వెంకటేష్ గురవయ్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు
.