ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని కోరుతూ అక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట చేపట్టిన మహా పాదయాత్ర శ్రీకాళహస్తి మండలంలోని జింగిలిపాలెం గ్రామానికి చేరుకుంది.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ మండలం సి.పి.ఎం ఆధ్వర్యంలో రైతులకు ఆకుపచ్చ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మండల కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ అమరావతి జే.ఏ.సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
ముఖ్యంగా ఈ పాదయాత్ర చివరి వరకు సి.పి.ఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కావేరి వెంకటేష్, ఈశ్వరయ్య, బాలకృష్ణ, గురవమ్మ మరియుసి.పీ.ఎం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.