మండలంలోని కారాకొల్లు పంచాయతీ శ్రీ క్రిష్ణ పురం గ్రామం లో బుధవారం కలవ గుంట భరత్ రెడ్డి క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువులోనే కాదు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు.
క్రీడల్లో కూడా ఆసక్తి ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తారు అన్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,బియ్యపు పవిత్ర రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
అందులో భాగంగా శ్రీ క్రిష్ణ పురం యువత కూడా అందించామన్నారు. అనంతరం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రయ్య చేతుల మీదుగా యువతకు క్రికెట్ కిట్ ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలోసురేష్, చంద్ర, చిరంజీవి, విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, వేణు, మునిశేఖర్, చిన్న బత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
.