శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా చేపడుతున్నటువంటి జానపద వృత్తి కళాకారుల సాంస్కృతిక కళల పోటీలను జయప్రదం చేయాలని ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి జగన్ పిలుపునిచ్చారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జానపద కళాకారుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పల్లెల్లో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు, మేళాలు, తాళాలు ఎన్నోరకాల కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని బతికించి తిరిగి ప్రజలలోకి తీసుకురావడానికి ప్రజానాట్యమండలి ప్రయత్నం చేస్తోందన్నారు.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగే మహాశివరాత్రి వేడుకలలో ఈ పోటీలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సంబరాలు జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జగన్ కోరారు. కళాకారులందరూ వారి కళారూపాలతో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మురళి, వేణు, హరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పుల్లయ్య, గురవయ్య, రైతు సంఘం నేత దాసరి జనార్ధన్ పాల్గొన్నారు.
.