రాజకీయ పార్టీలకు కుల సంఘాలను తాకట్టు పెట్టవద్దని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ జెఎసి అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో చిత్తూరు జిల్లా బీసీ వెల్ఫేర్ అధ్యక్షుని ఎంపిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని అతిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సత్రవాడ మునిరామయ్య కుమారుడు సత్రవాడ ప్రవీణ్ చిత్తూరు జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి జేఏసీ కండువా కప్పి ప్రమాణస్వీకారం చేయించారు. ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైన తమ కులాల కోసం పోరాటాలు సాగించాలని అట్టడుగు వర్గాలలో ఉన్న బీసీలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
అప్పుడే బీసీల ఐక్యత చాటి చెప్పినట్లు అని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బీసీలు ఎవరూ లేరని వివరించారు. చట్టసభల్లో 56 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నత విద్యావేత్తలు మేధావులు ఉన్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూడా బీసీల సంఖ్య అధికంగా ఉందని బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు వారికి పదవులను కట్టబెట్టడం లో మాత్రం వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవిని కూడా బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐక్యమత్యంతో ఉంటే బీసీల జాతికి మేలు చేయవచ్చని పిలుపునిచ్చారు.ఏ పార్టీలో నాయకులైన బీసీల ఐక్యత గురించి మాట్లాడాలి కానీ కులాల గురించి మాట్లాడుకోవడం తగదని వివరించారు. ఏ పార్టీని అయినా ఓడించే శక్తిని తీసుకున్నామని అదేవిధంగా రాజకీయాల్లో బీసీలను గెలిపించుకునే శక్తిని కూడా త్వరలోనే తెచ్చుకుంటామని వివరించారు. తండ్రికి తగ్గ తనయుడిగా సత్రవాడ ప్రవీణ్ ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ నెల 27వ తేదీన అమెరికా లో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బేధాభిప్రాయాలు వదిలి బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. నూర్ భాషా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బిసి వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల వెన్నెముక అని తెలిపారు. దొమ్మర కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎంబిసి అధ్యక్షులు ఎస్ గోపాల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీ లందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను కంటితుడుపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.
చిత్తూరు జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసి అధ్యక్షులుగా ఎన్నికైన సత్రవాడ.ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీసీల అందరినీ కలుపుకొని ఐకమత్యంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆ సభల్లో యువత చప్పట్లు కొట్టడం కాదు బీసీ నాయకుడు బాధ్యతలు చేపట్టిన సత్రవాడ ప్రవీణ్ ను ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు.
అనంతరం ప్రవీణ్ ను పలువురు నాయకులు దుశాలువతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి, బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉమాసింగ్, పలువురు సత్రవాడ ప్రవీణ్ యువత పాల్గొన్నారు.
.