శ్రీకాళహస్తి మండలం రామాపురం పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ లో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చినట్లు సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య చెప్పారు.
ఈ మేరకు ఆయన బుధవారం భగత్ సింగ్ కాలనీ పరిశీలించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ… సుమారు మూడు నెలలుగా భగత్ సింగ్ కాలనీలో తాగునీటి సమస్య నెలకొందన్నారు.
ఈ సమస్యను స్థానిక సర్పంచ్ బాలిరెడ్డి, మండల అధికారుల దృష్టికి సీపీఐ నేతగా తాను తీసుకు పోవడం జరిగిందన్నారు.
ఇందుకు స్పందించిన సర్పంచ్ బాలిరెడ్ఢి, మండల అధికారులు బుధవారం భగత్ సింగ్ కాలనీకి వచ్చి తాగునీటి సమస్య ను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
అదేవిధంగా వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు గురవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ, వీఆర్వో మహేశ్వరి, సీపీఐ పార్టీ నాయకులు రోడ్డా మల్లికార్జున్, రాజయ్య, శివ, స్థానికులు పాల్గొన్నారు.
.