శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ బుధవారం రాత్రి శ్రీకాళహస్తికి చేరిన సంగతి తెలిసిందే.
అమరావతి రైతులు గురువారం శ్రీకాళహస్తిలో పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రకు శ్రీకాళహస్తి వాసులు అపూర్వ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తికి వచ్చిన అమరావతి రైతులకు టీడీపీ నియోజక వర్గ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు.. టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు.
పాదయాత్ర చేసే వారికి అవసరమైన అన్ని వసతులు ఈయన కల్పించారు. స్వాగత ఏర్పాట్లు కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగాయి.
అమరావతి రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన విజయకుమార్ కు రైతులు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కంఠా రమేష్, ప్రకాశ్ నాయుడు. ప్రసాద్ నాయుడు, ప్రవీణ్ తదితరులుపాల్గొన్నారు.
.