చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని సోమవారం అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.చంద్ర దీక్షిత్ దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో ధనపాల్, ప్రోటోకాల్ సూపరింటటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ హరి బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.