శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ పరిధిలో శనివారం ఉదయం 9నంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నట్లు ఆ శాఖ ఈఈ వాసురెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండవ శనివారం పురస్కరించుకుని మరమ్మతుల్లో భాగంగా సరఫరా ఆపేస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణం, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడె, ఏర్పేడు, కేవీబీపురం, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
వినియోగదారులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
.