సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో డిసెంబర్ 11 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సదవకాశాన్ని విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కె అరుణ కోరారు.
చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి కె అరుణ మాట్లాడుతూ.. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కోర్టు నందు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల కేసులు ఈ అదాలత్ లో విచారిస్తారని అన్నారు.
సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్ సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాల మార్గంలో రాజీ మార్గంలో రాజీ కుదుర్చుకుని అత్యధిక కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు, ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో సుమారు 2రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138, బ్యాంక్ రికవరీ కేసు, Mact కేసు,
మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, ఇతర సివిల్ కేసు, రెవెన్యూ కేసు,
కాంపౌండ్ ఎక్సైజ్ కేసు, ఫ్రీ లిటిగేషన్ కేసులు.. మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు.
.