Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం నుంచి అంతరాలయ దర్శనం రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా భక్తులకు ఇచ్చే తీర్థ ప్రసాదాలు కూడా నిలిపివేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 1,257 కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇందులో చిత్తూరు జిల్లాలో 254 మందికి పాజిటివ్ రావడం విశేషం,
ఇవి రాష్ట్రంలోనే అత్యధికం. ఇక శ్రీకాళహస్తి పట్టణంలో కూడా కొవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముక్కంటి ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు విజ్ఞప్తి చేస్తున్నారు. కొవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు.
అర్చకునికి కరోనా అంటూ వదంతులు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఓ అర్చకునికి కరోనా సోకిందంటూ ఆదివారం వదంతులు వ్యాపించాయి. ఆలయంలో పని చేసే ఓ కీలక అర్చకుడు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి సమీపంలోని నారాయణాద్రి ఆసుపత్రిలో చేరాడు.
అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. దీంతో కొవిడ్ వలనే ఇలా జరిగిందని ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు ఖండించారు. ఆలయంలో ఎవరూ కొవిడ్ బాధపడలేదని… ఈ వదంతులు భక్తులు నమ్మవద్దని కోరారు.
.