శ్రీకాళహస్తి పట్టణంలోని కాసాగార్డెన్ గురుకుల పాఠశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఏల్ ల్యాబ్ ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి బియ్యపు ప్రారంభించారు.
పవిత్రరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని గురుకుల పాఠశాలలోని ఏటీఏల్ ల్యాబ్ నందు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు పథకం చేపట్టి పాఠశాలలను అభివృద్ధి చేయడమేకాక, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పాఠశాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభను అభివృద్ధి పరిచే విధంగా ఎగ్జిబిషన్ లో విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తున్నారని అన్నారు.
పాఠశాలయొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
.