తెలుగు యువత రాష్ట్ర మీడియా –ఆర్డినేటరుగా శ్రీకాళహస్తికి చెందిన కేవీ ప్రతాప్ ను నియమించారు.
టీడీపీ అధిష్టానం ప్రతాప్ కు సోమవారం నియామక ఉత్తర్వులు పంపింది.
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ… రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆశీస్సులతో తనకు ఈ పదవి లభించిందని ప్రతాప్ తెలిపారు.
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.
.