ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు కొణిజేటి రోశయ్య మృతి తీరని లోటని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా , తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా విశేష సేవలు అందించారని కొనియాడారు.
27 జనవరి 2010 న రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తొమ్మిదో పిఆర్సి ఫిట్మెంట్ పై JAC తో జరిపిన చర్చలు సందర్భంగా 39 శాతానికి అంగీకరించి మేలు చేశారని తెలిపారు.
తాను జే.ఏ.సి రాష్ట్ర కో చైర్మన్ గా , య.టి.యు రాష్ట్ర అధ్యక్షులుగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొని వెళ్లినప్పుడు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు కలిసినప్పుడు సానుకూలంగా స్పందించే వారిని గుర్తు చేసుకున్నారు.
.