సంక్రాంతి పండుగ వేళ ‘ప్రత్యేకం’ పేరుతో ఆర్టీసీ అదనంగా 50శాతం పెంచిన ఛార్జీలను తగ్గించాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ డిమాండు చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించే జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు.
పండుగ వేళ ప్రయాణీకులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపడం సరికాదన్నారు. కరోనా కష్టాల్లో ప్రజలు పండుగ చేసుకోవడమే భారంగా మారిన వేళ సామాన్య ప్రజలపై ఇంత భారం మోపడం జగన్ కే చెల్లుతుందన్నారు.
అదే తెలంగాణ ప్రభుత్వం పండుగ వేళ కూడా మాములు ఛార్జీలతోనే నడపాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ ఆర్టీసీకి గిట్టుబాటు అయ్యేటప్పుడు.. ఏపీఎస్ ఆర్టీసీకి ఎందుకు గిట్టుబాటు కాదని చక్రధర్ ప్రశ్నించారు.
సినిమా టికెట్ల ధరలు పెంచాలని ఆ పరిశ్రమ వారు నెత్తీ నోరు మొత్తుకుంటున్నా.. ప్రజలపై భారం తగ్గించడానికి ధర తగ్గించామని చెపుతున్న జగన్ పండుగ వేళ ప్రజలపై ‘అధనపుబారం’ ఎందుకు మోపుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
ఆర్టీసీ చార్జీలు పెంచడంతో ప్రైవేటు బస్సుల వారు కూడా భారీగా ఛ4ర్జీలు పెంచేశారన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని అదనపు ఛార్జీలను తగ్గించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
.