రష్ హాస్పిటల్ అధినేత వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం జన్మదిన వేడుకలను శనివారం వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం కమిటీ ఉపాధ్యక్షులు లు పెరుమాళ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద ఘనంగా నిర్వహించారు.
శాలువాలతో పూలమాలతో పలువురు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి అభిమానం పంచిపెట్టారు అనంతరం సుమారు 1000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలిపారు.
తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎందరో పేదలకు తన హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు తక్కువ ఫీజుతో రాయలసీమలోనే అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు, కౌన్సిలర్ ఉదయ్ కుమార్, ముత్యాల కృష్ణ, చక్రాల ఉష, సునీత, ఈశ్వర్ సింగ్, గరికపాటి రమేష్ బాబు, చంద్ర, న్యాయవాది ప్రసాద్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం సభ్యులు కృష్ణా రెడ్డి , బుజ్జి రెడ్డి, రత్నం రెడ్డి, మురళి కృష్ణ రెడ్డి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, రామ్ రాజ్ కాటన్ అధినేత హరికేష్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, ముని కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సుందరం, పెరుమాల్ రెడ్డి, శంకర్ రెడ్డి భారీ స్థాయిలో వన్నె కుల క్షత్రియులు పాల్గొన్నారు.
.