తంగేళ్లపాళెం సహకార పరపతి సంఘాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ పని చేయాలని పీఏసీఎస్ డెవలప్ మెంట్ సెల్ మేనేజరు ప్రసాద్ అన్నారు.
తొట్టంబేడు మండలం పరిధిలోని తంగేళ్లపాళెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కార్యాలయంలో సోమవారం జిల్లాలోని 20 సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తంగేళ్లపాళెం సహకార పరపతి సంఘం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ప్రణాళికా బద్దంగా ముందకు పోతోందన్నారు. రైతుల సేవల్లో కూడా వీరు ముందున్నారన్నారు.
తంగేళ్లపాళెం కార్యాలయం వారు చేపట్టిన పద్ధతులను మిగిలిన వారు కూడా అనుసరిస్తే బాగుంటుందన్నారు. అంతకు మునుపు తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు గుడ్లూరు మోహన్ కిషోర్ నాయుడు తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.
రైతుల సేవలో తమ పరపతి సంఘం ముందు వరుసలో ఉందన్నారు. అధికారుల సాయంతో ఈ సేవలు అందించ గలుగుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఈవో చిరంజీవులురెడ్డి, డైరెక్టర్లు వై.భక్తవత్సలం, కె.ప్రభాకర్, డీసీసీ బ్యాంకు సూపర్ వైజరు మురళీమోహన్ రెడ్డి, పీడీసీ సెల్ అధికారి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.