రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి హితవు పలికారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ‘అక్క’ ప్రస్తావన తెచ్చి బూతు మాటలు మాట్లాడటం బాధాకరమన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సభ్యత , సంస్కారాన్ని వదలిపెట్టి అలాంటి అభ్యంతకరమైన మాటలు మాట్లాడటం తగదన్నారు. .
ఆయన వెంటనే చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పాలని గురవారెడ్ఢి డిమాండు చేశారు.
ప్రజాజీవితం లో ఉన్న నాయకులు తమ భాషను, వాడే పదజాలాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన వాడిన బాష, మాటలు తీరునుబట్టి చూస్తుంటే అసెంబ్లీలో వైసీపీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి మాట్లాడిన అమానుష మాటలు సజ్జల రామకృష్ణా రెడ్డి సలహా, స్క్రిప్టుతోనే మాట్లాడినట్లు భావించాల్సి వస్తోందన్నారు.
అసెంబ్లీ బయట బూతులు మాట్లాడుతున్న కొందరు మంత్రులు , ఎమ్మెల్యేలు , నాయకులకు ఈయనే అలాంటి భాషకు సలహా ఇస్తున్నారేమోనని అనుమానం వస్తోందన్నారు.
ఇలాంటి పదజాలం వాడటం మానుకోకపోతే సభ్యసమాజం వీరిని క్షమించదన్నారు. రాబోయే కాలంలో ప్రజలే బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారన్నారు.
.