జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు చేయాలని ఈ నెల 21 వ తేదీన చిత్తూరు నగరంలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పిలుపు నిచ్చారు .
ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సు కరపత్రాలను విడుదల చేశారు . ఈ సందర్భంగా చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల పేదలకు ఎంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకం ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదన్నారు.
ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలు జరిగినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నా వాటిని నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు . ఉపాధి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని పెంచలయ్య డిమాండ్ చేశారు .
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను కాపాడుకొనుటకు చిత్తూరు నగరంలో ఈ నెల 21 వ తేదీన జరిగే జిల్లా సదస్సు కు బీకేయంయూ జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే , పెరియసామి , రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ , సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.
ఈ సభకు జిల్లాలో ఉన్న గ్రామీణ పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి.కృష్నప్ప , ఉపాద్యక్షులు ఎన్ . సురేంద్ర నాథ్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రాజన్ , శివ కుమార్ , రుద్రపాకు శ్రీనివాసులు , దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నం కాళయ్య , ఎస్. నాగరాజు , మహేష్ , చంద్ర , దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట రమణ, మారెళ్ల శ్రీనివాసులు, మార్కొండయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్. గుర్రప్ప , ఎం. సుబ్రమణ్యం , జె. నాగరాజు , డి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు .
.

Discussion about this post