చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని గురువారం యూపీఎస్సీ కార్యదర్శి వసుధ మిశ్రా దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈమెకు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్ఫాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్, డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెఢ్డి. ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, సారథి తదితరులు పాల్గొన్నారు.
.