నిష్కళంక రాజకీయయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన శ్రీ కొణజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జనసేన జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ అన్నారు.
రాజకీయ రంగంలోకి ప్రవేశించిన 1968లో శాసనమండలి సభ్యునిగా ఎంపికైనది మొదలు ఆయన నిరంతరంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూనే వురన్నారన్నారు.
ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోను తనదైన శైలితో ప్రత్యేకతను చాటుకున్నారు. 1972లో మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఎందరు ముఖ్యమంత్రులు మారినా మంత్రిమండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై విశేషానుభవం ఉన్న శ్రీ రోశయ్య గారు 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆ అనుభవం, ఆయనలోని విధేయత ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపింది. ఆపత్కాల సమయంలో 14 నెలలపాటు శ్రీ రోశయ్యముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
పాలనాపరంగా ఆయన చూపిన విజ్ఞత, వ్యవహారశైలిని తెలుగు ప్రజలు మరచిపోలేరు. అనంతరం పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తమిళ ప్రజల ఆదరాభిమానాలను పొందడం ఆయనలో విశాల దృక్పథానికి నిదర్శనం. ఆయనలో వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయి.
సుదీర్ఘ కాలంపాటు ఉన్నత పదవులలో కొనసాగినా వేలెత్తి చూపలేని పాలన ఆయన సొంతం. నీతి నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన శ్రీ రోశయ్య గారు నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులు. శ్రీ రోశయ్య గారు మృతికి నా తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నాను.
సఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని అంజూరు చక్రధర్ తెలిపారు.
.