ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా.. వారిని మనతో సమానంగా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి అరుణ పిలుపునిచ్చారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని భవిత ప్రత్యేక పిల్లల వనరుల కేంద్రం లో ఈరోజు ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి అరుణ మరియు ఎం ఈ ఓ భువనేశ్వరి, ఎంపీడీవో నరసింహమూర్తి, న్యాయవాది రమేష్ బాబు…. మొదలైన వారు పాల్గొన్నారు.
ముందుగా ఆట పోటీల్లో గెలిచిన ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులకు గౌరవ సీనియర్ సివిల్ జడ్జి చేతులమీదుగా బహుమతి ప్రధానo చేసినారు.
సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ…. ముందుగా విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపినారు.
అలాగే ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులకు ఏదో ఒక రంగంలో ఉత్తీర్ణులై ఉంటారు, దానిని మనం గుర్తించి వారిని ఆ రంగంలో ప్రోత్సహించాలని కోరినారు. అలాగే మనతో సమాజంలో వారికి సమానమైన హక్కులు ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపినారు
.